ఆయిలీ స్కిన్‌తో వర్రీ వద్దు.. ఈ రెమెడీని ట్రై చేస్తే ఫ్రెష్ స్కిన్ మీ సొంతం!
TeluguStop.com

చర్మతత్వాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.అందులో ఒకటి ఆయిలీ స్కిన్.


జిడ్డు చర్మ తత్వం కలిగిన వారి బాధలు అంతులేనివి అనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఆయిలీ స్కిన్ మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ఇలా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.
పైగా మేకప్ వేసుకున్నా, డైలీ క్రీమ్స్ రాసుకున్నా కొద్ది సేపటికే ముఖం జిడ్డుగా కారుతుంటుంది.
ఇక ఫేస్ వాష్ చేసుకున్న కొన్ని నిమిషాలకే ముఖం మళ్లీ ఆయిలీగా మారిపోతుంటుంది.
అందుకే జిడ్డు చర్మతత్వం కలిగిన వారు నలుగురితో కలవాలంటేనే వెనకడుగు వేస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.
? అయితే వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని ట్రై చేస్తే అందమైన, కాంతివంతమైన తాజా చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా నీటిలో శుభ్రంగా కడిగిన ఒక బంగాళదుంపను తీసుకుని సగానికి కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వాటర్‌లో వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
"""/" /
ఇలా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలకు తొక్కను తొలగించి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, చిటికెడు కస్తూరి పసుపు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి మెల్ల మెల్లగా రుద్దుకుంటూ శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల అదనపు జిడ్డు తొలగిపోయి ముఖ చర్మం ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.
కాబట్టి, ఎవరైతే ఆయిలీ స్కిన్ సమస్యతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసేందుకు ప్రయత్నించండి.
పహల్గామ్ ఉగ్రదాడి .. యూకేలోని పాక్ హైకమీషన్ ఎదుట ఎన్ఆర్ఐల నిరసన