బతికే ఉన్నా అని నిరూపించేందుకు కష్టాలు పడుతున్న వృద్దురాలు!

ఓ మహిళ తాను బతికి ఉన్నానని నిరూపించుకోవడానికి మూడేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది.

బతికి ఉన్నప్పటికీ ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతుంది.ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు.జెన్‌ పౌచైన్‌ అనే 58 ఏళ్ల మహిళకు ఓ క్లీనింగ్‌ కంపెనీ ఉంది.

కొన్నేళ్ల పాటు ఆ కంపెనీని ఆమె రన్ చేసింది.అయితే 2000 సంవత్సరంలో ఓ పెద్ద కాంట్రాక్ట్ వల్ల జెన్ క్లీనింగ్ కంపెనీ నష్టాలను చవిచూసింది.

దీంతో ఆమె కంపెనీలో పలువురు ఉద్యోగులకు తొలగించింది.అలా తొలగింపుకు గురైన వారిలో ఓ మహిళ జెన్‌కు చెందిన కంపెనీపై కేసు వేసింది.

తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరింది.ఇందుకు సంబంధించి విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం ఉద్యోగం నుంచి తొలగించబడ్డ మహిళలకు 14000 యూరోల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా జెన్‌ను ఆదేశించింది.

"""/"/ అయితే కోర్టు చెప్పినట్టుగా జెన్ నడుచుకోలేదు.ఈ క్రమంలోనే కొన్నేళ్ల తర్వాత ఉద్యోగం కోల్పోయిన మహిళ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

అయితే ఆమె వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొన్ని కారణాలతో కొట్టివేసింది.దీంతో తాత్కాలికంగా జెన్‌కు ఊరట లభించినప్పటికీ.

ఆ తర్వాత అసలే కథ మొదలైంది.జెన్‌పై ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

తన ఉత్తరాలకు జెన్‌ నుంచి స్పందన లభించడం లేదని, అందువల్లే ఆమె మరణించినట్టే పరిగణించాలని కోర్టును కోరింది.

తనకు చెల్లించాల్సిన పరిహారాన్ని జెన్ భర్త, ఆమె పిల్లల నుంచి ఇప్పించాలని కోర్టుకు విన్నవించింది.

ఈ క్రమంలో ధ్రువీకరణ పత్రాలు పూర్తిగా పరిశీలించకుండా కోర్టు 2017లో తీర్పును వెల్లడించింది.

జెన్ మరణించినట్టు ప్రకటించింది.దీంతో అధికారులు జెన్‌ ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఆరోగ్య బీమా అన్నీ రద్దయ్యాయి.

ఆ మహిళ ఉద్యోగి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.కోర్టు పరిహారం తప్పించుకోవడానికే జెన్ తాను చనిపోయినట్టు నాటకం ఆడిందని ఆరోపించారు.

దీంతో తాను బతికే ఉన్నట్టు నిరూపించుకోవడానిక జెన్ గత మూడేళ్లుగా పోరాటం చేస్తుంది.

ఇందుకోసం ఇప్పటికే అనేక పర్యాయాలు కోర్టు మెట్లు ఎక్కింది.జెన్ బతికే ఉన్నట్టు కోర్టులు గుర్తించేవరకు పోరాడతామని ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు.

టాయిలెట్‌లో వింత శబ్దం.. తీరా చూస్తే 10 అడుగుల పెద్ద పాము?