ఇదేందయ్యా ఇది: పిల్లి పిల్ల అనుకోని పులి పిల్లని కొన్న ఘనులు…!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో సాధు జంతువులను పెంచుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు.

పిల్లి, కుక్క లాంటి జంతువులను ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.అయితే మన భారతదేశంలో ఇలా ఇంట్లో జంతువులను పెంచడం మిగతా దేశాలతో పోలిస్తే కొద్దిగా తక్కువే అని చెప్పవచ్చు.

ఇప్పుడిప్పుడే భారత దేశంలో ఈ కల్చర్ అలవాటుగా మారుతుంది.ఇలా ఇంట్లో సాధు జంతువులను పెంచుకోవడానికి బయట మార్కెట్లో లభించే పిల్లులు, కుందేలు, కుక్కలు వంటి వాటిని కొని తెచ్చుకొని పెంచుకుంటున్నారు.

అసలు విషయంలోకి వెళితే.తాజాగా ఈ విషయంలో ఒక జంటకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది.

2018 సంవత్సరంలో ఆ జంట ఆన్ లైన్ లో పిల్లిని కొనుగోలు చేశారు.

అంతవరకు బాగానే ఉన్నా వయసు పెరిగే కొద్దీ ఆ పిల్లి లో పిల్లికి సంబంధించిన లక్షణాలు కనపడకపోవడంతో వారికి అనుమానం వచ్చింది.

ఈ విషయంలో ఆ జంట చివరికి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీనికి కారణం 2018 సంవత్సరంలో వారు ఆన్ లైన్ లో ఓ యాడ్ చూసి సవనా జాతికి చెందిన పిల్లి పిల్లను అమ్ముతాము అంటూ ఉండగా.

దాంతో వారు ఏకంగా ఏడు వేల డాలర్లు చెల్లించి ఆన్ లైన్ లో ఆర్డర్ బుక్ చేశారు.

దీంతో వారికి ఆ పిల్లి ఇంటికి డెలివరీ రావడం జరిగింది.ఇదంతా బాగా ఉన్న రెండు సంవత్సరాలు వారు అ పిల్లిని ఎంతో మురిపెంగా పెంచుకున్న దానికి పిల్లి లక్షణాలు కనిపించకపోవడంతో వారికి అనుమానం వచ్చింది.

దీంతో వెంటనే వారు జంతువుల నిపుణులకు చూపించగా అది పిల్లి కాదని సుమత్రా దీవుల్లో ఉండే ఓ రకమైన జాతికి చెందిన పులి అని తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న వారు షాక్ కు గురయ్యారు.నిజానికి అది పులి పిల్ల అని వారికి తెలియదు.

అయినా కానీ వారు నేరం చేసినట్లు భావించి పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు.

దీనికి కారణం సుమత్ర పులి జాతి అరుదైన జాతికి చెందిన జీవుల జాబితాలో ఉంది.

ప్రపంచంలో ఈ రకం పులులు కేవలం నాలుగు వందలు మాత్రమే బతికి ఉన్నాయి.

ఇకపోతేప్రస్తుతం ఆ పులి పిల్ల ఆరోగ్యంగానే ఉండగా దానిని బయోడైవర్సిటీ ఆఫీస్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

చివరికి మాత్రం ఆ జంట చేయని తప్పుకు చివరికి జైలుపాలు అవ్వాల్సి వచ్చింది.

వైరల్ వీడియో: వెరైటీగా కనపడ్డ రాయి.. తవ్వి చూడగా ఏకంగా..