మీరు ఎక్కడకి వెళ్లినా ... అది మాత్రం ఫ్రీ ... ఇక మీకు పండగే !
TeluguStop.com
సాధారణ పండుగ హడావుడి ఎలా ఉన్నా .ఓట్ల పండుగ దగ్గరకు వస్తుందంటే చాలు రాజకీయ పార్టీలు ప్రజల మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తాయి.
ప్రజలు అడిగినవి అడగనవి అన్నీ అమలు చేస్తామంటూ హడావుడి చేసేస్తుంటాయి.ఇక ఇప్పుడు ఏపీలోనూ అదే హడావుడి మొదలవ్వడంతో అధికార పార్టీ టీడీపీ సరికొత్త ఆలోచనలతో ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ప్రస్తుత రోజుల్లో ఎవరి దగ్గర చూసినా.స్మార్ట్ ఫోన్ లే ఉంటున్నాయి.
ప్రతి క్షణం ఆన్లైన్ లో ఏదో ఒకటి చూస్తూనే యువత అంతా గడిపేస్తున్నారు.
గతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు చాలా ఖరీదు ఉండేవి.అయితే.
జియో పుణ్యమా అంటూ.మొబైల్ ఆపరేటర్ల మధ పోటీ ఏర్పడి అతి తక్కువ ధరకే ఆ సేవలు అందుబాటులోకి వచ్చేసాయి.
అదే ఇంటర్నెట్ ఇకనుంచి ఫ్రీగా వస్తే.ఇంకేముంది ఎగిరి గంతులేసుకుంటూ ఇంటర్ నెట్ వాడేసుకుంటాము కదా ఇప్పుడు అలా ఎగిరి గంతులేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఫిబ్రవరి 15 నుంచి ఏపీలోని అన్ని మున్సిపాల్టీల్లో ఉచితంగా వైఫై సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వచ్చే నెల 15 నుంచి ఏపీలోని 110 మున్సిపాలిటీల్లోని 970 ప్రాంతాల్లో వైఫై సేవల్ని ఉచితంగా పొందేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించి గూగుల్ సంస్థతో కూడా ఒప్పందం కుదిరింది.ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఈ సేవలు ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన విధి విధానాల్ని ఇంకా ఖరారు చేయలేదు.అంటే.
ఫ్రీ వైఫై ఎంత జీబీ వరకు ఇస్తారు ఒకవేళ ఇచ్చిన పరిమితి దాటిపోతే.
అదనపు డేటా కోసం ఏమైనా చెల్లించాలా చెల్లించాలి అంటే రేట్లు ఎలా ఉంటాయి.
అనే విషయాల్ని త్వరలో ఏపీ ప్రభుత్వం రూపొందించబోతుంది.
పెళ్లంటే ఈవిడకు దోపిడీనే.. చూడ చక్కని రూపంతో రూ.1.25 కోట్లు స్వాహా!