Congress : ఉచిత విద్యుత్, గృహలక్ష్మి రేపే అమలు : బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య

రేపటి రోజు గృహలక్ష్మి పథకం( Gruhalakshmi Scheme ), ఉచిత విద్యుత్ అమలు కాబోతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య( Dommati Narasaiah ) అన్నారు.

ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ముందుకు వస్తున్న పాలన తమ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.

పార్లమెంటు ఎన్నికలకు ముందే మరో రెండు పథకాలు అమలు చేసి ఆరు పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

బాబుతో బాబూమోహన్ .. టీడీపీ లో చేరుతున్నట్టే ?