ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను ప్రస్తుతం అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.  సంక్షేమంతో పాటు, అభివృద్ధి విషయం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

  తాజాగా మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈనెల 31వ తేదీన దీపావళి సందర్భంగా ఇంటింటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) ప్రారంభించనున్నారు.

"""/" / ఆ తర్వాత రోజు నుంచి మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో టిడిపి ప్రధానంగా ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే దీని అమలు సాధ్యసాధ్యాలపై అధికారులు అధ్యయనం చేశారు.తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకాల పనితీరును పర్యవేక్షించారు.

ఈ మేరకు దీపావళి తర్వాత రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణ ( Free Bus Travel )పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది .

"""/" / ఈ మేరకు చిత్తూరు టిడిపి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈ విషయాన్ని వెల్లడించారు .

అధికారికంగా ప్రభుత్వం ఈ విషయంపై ప్రకటన చేయనప్పటికీ , టిడిపి ఎమ్మెల్యే ఈ విషయాన్ని వెల్లడించడంతో ఆరోజు నుంచే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇప్పటికే కర్ణాటక,  తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం అమలవుతోంది.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఎక్కడా  ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.

  ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించారు.

దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు .కొత్త బస్సులను కూడా వివిధ జిల్లాలకు కేటాయించారు.

పాన్ ఇండియా స్పూఫ్ లతో సుడిగాడు సీక్వెల్.. నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?