150 మందికి ఉచితంగా బిపి, షుగర్, రక్త పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 5వ రోజులో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా 150 మందికి షుగర్, బిపి, రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.అనంతరం, విద్యార్థులు ఇంకుడుగుంతలు శుభ్రం చేపట్టారు.

ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, ప్రతి నీటి బొట్టును ఓడిసి పట్టుకోవాలని, ఈ వేసవికాలంలో సంరక్షణ కార్యక్రమాలు చేపడితే రానున్న వర్షాకాలంలో సత్ఫలితాలు ఇస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా.జి.

శ్రీదేవి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాటి.అరుణ్ బాబు, కే.

భవ్య,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Aditya Music Secures Audio Rights For “Laggam” !!!