ఎంత దారుణం.. కొడుకు జీతాన్ని తండ్రికి దక్కనివ్వని కేటుగాళ్లు!

కొండంత ఆశ‌తో కొడుకు పంపిన జీతాన్ని తీసుకోవ‌డానికి వెళ్లాడు ఆ తండ్రి.కానీ దుర‌దృష్టం కూడా దొంగ‌ల రూపంలో ఆయ‌న వెంటే వ‌చ్చింది.

దీంతో ఆయ‌న క‌ల‌ల‌న్నీ అడియాశ‌ల‌య్యాయి.ఆ క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ కొడుక్కు తాను కోరుకున్న ఆర్మీలో ఉద్యోగం సంపాదించిన త‌ర్వాత త‌న తండ్రికి అండ‌గా నిలిచేందుకు త‌న శిక్షణ కంప్లీట్ అయ్యాక తన మొద‌టి జీతాన్ని ఏ మాత్రంఆ ఆల‌స్యం చేయ‌కుండా త‌న తండ్రికి పంపించాడు.

ఇక త‌న తండ్రి కూడా ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌న కొడుకు పంపిన జీతాన్ని తీసుకుందామ‌ని కొండంత ఆశ‌తో ఏటీఎంకు వెళ్లాడు.

కానీ ఇద్దరు కేటుగాళ్ల రూపంలో ద‌రిద్రం ఆయ‌న్ను వెంటాడింది.వారిద్ద‌రూ క‌లిసి సాయం పేరుతో పెద్దాయ‌న్ను ట్రాప్ చేసి రూ.

40 వేలు కొట్టేయ‌డం ఇప్పుడు విస్మ‌యానికి గురి చేస్తోంది.ఇక తాను మోస‌పోయాన‌ని అస‌లు విషయం తెలుసుకున్న ఆ తండ్రి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.

తాను ఏం పాపం చేశానంటూ గుండెలు అవిసేలా రోదించాడు.ఈ ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోంది.

అయితే ఈ విష‌యం విశాఖజిల్లాలో జ‌ర‌గ్గా చాలా ఆలస్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని స్థానిక పోలీసులు వివ‌రించారు.

"""/"/ జిల్లాలోని స్థానిక మాడుగుల మడలం వీరవల్లి అగ్రహారానికి చెందిన రైతుకూలీ అయిన సన్యాసిరావు త‌న కొడుకు త‌న‌లా కాకూడ‌ద‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి మ‌రీ ఆర్మీలో చేర్పించి త‌న కొడుకు ఉన్న‌తి కోసం ప్ర‌య‌త్నించాడు.

ఇక ఆయ‌న కొడుకు కూడా తండ్రి ఆశ‌యాల కోసం విధుల్లో చేరాడు.త‌ద‌నంత‌రం త‌న తొలిజీతాన్ని అందుకున్న వెంట‌నే తండ్రి బ్యాంకు ఖాతాలో వేసి చెప్పాడు.

ఇక తండ్రి కూడా ఎన్నో ఆశ‌ల‌తో బ్యాంకుకు వెళ్ల‌గా అక్క‌డ ఉన్న సిబ్బంది ఏటీఎంకు వెళ్లి తీసుకోమ‌ని చెప్పగా ఆయ‌న అలాగే చేశాడు.

కాక‌పోతే ఆయ‌న‌కు ఏటీఎం నుంచి డ‌బ్బులు విత్ డ్రా చేయడం తెలియకపోవ‌డంతో ఆయ‌న‌కు సాయం చేస్తామ‌ని ఇద్ద‌రు కేటుగాళ్లు అక్క‌డ‌కు వ‌చ్చారు.

ఆయ‌న్ను ట్రాప్ చేసి ఏటీఎం కార్డు మార్చేసి పిన్ కార్డు తెలుసుకున్నారు.పెద్దాయ‌న‌కు వేరే ఏటీఎం కార్డు ఇచ్చారు.

ఆయ‌న అక్క‌డి నుంచి వెళ్ల‌పోయాక వారు మొత్తం డ‌బ్బుల‌ను డ్రా చేసుకున్నారు.దీంతో స‌న్యాసిరావు తీవ్ర ఆవేద‌న చెందాడు.

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటన