ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం.. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అకౌంట్ ఖాళీ..!
TeluguStop.com
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతకంటే అడ్వాన్స్ గా సైబర్ నేరగాళ్లు( Cyber criminals ) ఆన్లైన్ మోసాలు చేస్తున్నారు.
ఆన్లైన్లో జరిగే మోసాల గురించి సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.
ఎన్ని చర్యలు తీసుకున్న కూడా సైబర్ నేరాలకు అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది.
అయితే ఈ దోపిడీలకు ప్రధాన కారణం మనిషికి ఉండే అత్యాశనే.ఆన్ లైన్ గురించి సరైన అవగాహన లేక ఆన్లైన్లో కనిపించే లింకులు, యాప్ లను అనవసరంగా గెలికి అకౌంట్లో ఉండే ఖాతాను హ్యాక్ కు గురి చేసుకుంటున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఒక సైబర్ ఘరానా మోసం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
అసలు సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేశారో అనే వివరాలు చూద్దాం. """/" /
ఎన్టీఆర్ జిల్లా ( NTR District )కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల ఖాతాల నుంచి దాదాపుగా రూ.
2 కోట్ల రూపాయల నగదును సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు.చాలా సులభంగా డబ్బు కాజేశారు.
కేవలం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రూ.150 రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి అనడంతో.
పెండ్యాల గ్రామానికి చెందిన వ్యక్తులు ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు.అంతేకాకుండా ఒకరి నుంచి మరొకరికి యాప్ మార్చుకుంటే ఇంకాస్త ఎక్కువ మొత్తంలో డబ్బులు అకౌంట్లో జమ( Account ) అవుతాయని సైబర్ నేరగాళ్లు నమ్మించారు.
"""/" /
గ్రామంలో ఉండే వ్యక్తులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అకౌంట్లో రూ.
150 జమ అయినట్లు చూపించింది.కానీ కాసేపటి తర్వాత అకౌంట్ లో ఉండే నగదు మొత్తం మాయం అయ్యింది.
వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ప్రైవేట్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా డబ్బులు కొట్టేసినట్లు గుర్తించారు.
ఈ నేరాన్ని సైబర్ కేటుగాళ్లు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
అనిల్ రావిపూడి సినిమాలో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి కనిపిస్తాడా..?