నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో IN ప్రకారం, 2023లో ఫ్రాన్స్‌లో( France ) జన్మించిన శిశువుల సంఖ్య చాలా తక్కువగా నమోదయింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ స్థాయిలో జననాల రేట్లు( Birth Rate ) పడిపోవడం ఇదే తొలిసారి.
2023 సంవత్సరంలో కేవలం 678,000 మంది పిల్లలు మాత్రమే జన్మించారు, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 6.
6 శాతం తక్కువ.1946 నుంచి ఏ సంవత్సరంలో ఈ జననాల సంఖ్య ఇంత తక్కువకు పడిపోలేదు.
సగటు జనన రేటు ప్రతి మహిళకు 1.68 మంది పిల్లలుగా నమోదయింది, ఈ రేటు 2022లో 1.
79 మంది పిల్లలుగా ఉంది. """/" /
ఫ్రెంచ్ జనాభా( France Population ) ఇప్పటికీ 0.
3 శాతం పెరిగింది, ఎందుకంటే 2023లో తక్కువ మరణాలు కూడా ఉన్నాయి.ఆ సంవత్సరం ఫ్రాన్స్‌లో 6,31,000 మంది మరణించారని డేటా చూపించింది, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 6.
5 శాతం తక్కువ.2022లో, కోవిడ్-19, హీట్‌వేవ్‌ల కారణంగా చాలా మంది చనిపోయారు.
జనాభాను పెంచిన మరో అంశం వలసలు.2023లో ఫ్రాన్స్‌ను విడిచిపెట్టిన వారి కంటే 183,000 మంది ఎక్కువ మంది ప్రజలు ఫ్రాన్స్‌కు తరలివెళ్లారని IN తెలిపింది.
"""/" /
ఫ్రాన్స్‌లో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవించారని డేటా కూడా చూపింది.
సగటు ఆయుర్దాయం( Life Expectancy ) స్త్రీలకు 85.7 సంవత్సరాలు, పురుషులకు 80 సంవత్సరాలు.
2023లో జననాల రేటు తగ్గడానికి గల కారణాన్ని నిపుణులు ఇంకా వెల్లడించలేదు.ఈ జననాల సంఖ్య తగ్గడం వెనక గల కారణమేంటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ సంఖ్య తగ్గడం వల్ల దేశంపై ఏదైనా ప్రభావం పడుతున్న అన్న కోణంలోనూ కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.
మా ఇంటికి చిట్టితల్లి వచ్చింది… ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీ లీల!