తెలంగాణ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.

ఈ మేరకు 12 మందితో లిస్టును ప్రకటించింది.ఈ క్రమంలో చెన్నూర్ నియోజకవర్గం అభ్యర్థిగా దుర్గం అశోక్, ఎల్లారెడ్డి - సుభాష్ రెడ్డి, వేములవాడ - తుల ఉమ, హుస్నాబాద్ - శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట - దూది శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ ( ఎస్సీ) -పెద్దింటి నవీన్ కుమార్, కొడంగల్ - బంటు రమేశ్ కుమార్, గద్వాల్ - బోయ శివ, మిర్యాలగూడ - సాదినేని శ్రీనివాస్, మునుగోడు - సి కృష్ణారెడ్డి, నకిరేకల్ (ఎస్సీ) - ఎన్ మొగులయ్య, ములుగు (ఎస్టీ) - అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ ను అభ్యర్థులుగా ప్రకటించింది.

అయితే ఇటీవలే పార్టీలో చేరిన సుభాష్ రెడ్డి, సి కృష్ణారెడ్డి టికెట్ కేటాయించడం విశేషం.

ఇప్పటివరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో 19 స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

కాగా పొత్తు నేపథ్యంలో జనసేనకు ఇచ్చే స్థానాలపై స్పష్టత వచ్చిన తరువాత ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

మలయాళం హీరోల బాటలో నడుస్తున్న తెలుగు సీనియర్ హీరోలు…