నిజ్జర్ హత్య కేసు : కెనడా పోలీసుల అదుపులో మరో భారతీయుడు.. నాలుగుకి చేరిన అరెస్ట్‌లు

ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసులో మరో భారతీయుడిని కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకి చేరింది.

నిజ్జర్ హత్య కేసులో ఇప్పటికే కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌లను అల్బెర్టా ప్రావిన్స్‌లోని ఎడ్మంటన్‌ సిటీలో అరెస్ట్ చేశారు.

ఆర్‌సీఎంపీ (సర్రే)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) , ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ సాయంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తిని అమర్‌దీప్ సింగ్ (22)గా గుర్తించారు.బ్రాంప్టన్‌ అబాట్స్‌ఫోర్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న అతనిపై ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్రపన్నినట్లుగా అభియోగాలు మోపారు.

అమర్‌దీప్ అరెస్ట్‌పై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ( Royal Canadian Mounted Police )(ఆర్‌సీఎంపీ)కి చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ) ప్రకటన విడుదల చేసింది.

మే 11న సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది.అయితే ఈ కేసుతో సంబంధం లేని తుపాకీ కలిగివున్నట్లుగా నమోదైన అభియోగాలపై ఇప్పటికే అమర్‌దీప్ .

పీల్ రీజినల్ పోలీస్ కస్టడీలో వున్నట్లుగా తెలుస్తోంది.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం వున్న వారిని కనుగొనడంలో కొనసాగుతున్న మా దర్యాప్తుకు తాజా అరెస్ట్ నిదర్శనమని ఐహెచ్ఐటీ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ మన్‌దీప్ మూకర్( Mandeep Mooker ) అన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న విచారణలు , కోర్టు ప్రక్రియల కారణంగా అరెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేమని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.

"""/" / కాగా.నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడాలో జరుగుతున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు.

ఖలిస్తానీ వేర్పాటువాద అంశాలకు పొలిటికల్ స్పేస్ ఇవ్వడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ ఓటు బ్యాంక్.

చట్టబద్ధమైన పాలన కంటే శక్తివంతమైనదనే సందేశాన్ని పంపుతోందన్నారు.జాతీయ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.

భారతదేశం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు. """/" / అయితే అది విదేశీ దౌత్యవేత్తలను బెదిరించే స్వేచ్ఛతో సమానం కాదని.

వేర్పాటువాదానికి, హింసను సమర్ధించే అంశాలకు పొలిటికల్ స్పేస్‌ను అనుమతించదన్నారు.పంజాబ్ నుంచి వలస వెళ్లిన సిక్కులలో ఖలిస్తానీ మద్ధతుదారులను ప్రస్తావిస్తూ.

అనుమానాస్పద నేపథ్యాలు కలిగిన వ్యక్తులు కెనడాలో ప్రవేశించడానికి , నివసించడానికి ఎలా అనుమతిస్తున్నారని జైశంకర్ ప్రశ్నించారు.

నియమబద్ధంగా నడిచే సమాజంలో వ్యక్తుల నేపథ్యం, వారు ఎలా ప్రవేశించారు, ఏ పాస్‌పోర్టులను తీసుకెళ్లారు తదితర అంశాలను తనిఖీ చేస్తారని మంత్రి అన్నారు.

సింగిల్ టేక్ లో బాలయ్య నటన చూసి 400 మంది చప్పట్లు కొట్టారట.. ఏం జరిగిందంటే?