సింగరేణిలో రానున్న నాలుగు సంవత్సరాల్లో 14 కొత్త గనుల ప్రారంభమట.. !

సింగరేణి సంస్దను లాభాల బాటలో నడిపించి రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మరో 14 కొత్త గనులను ప్రారంభించాలంటే ప్రస్తుతం ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని దీనికి అందరు సహకరించాలని, సంస్థ సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు.

ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల లక్య సాధన దిశగా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

కాగా ప్రస్తుతం సింగరేణి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి వచ్చే ఏడాది 67 మిలియన్ టన్నులకు చేరబోతుందని వెల్లడించారు.

"""/"/ ఇకపోతే హైదరాబాద్ సింగరేణి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే మేధోమధన సదస్సులో సింగరేణి భవిష్యత్ ప్రణాళికలపై సింగరణి డైరెక్టర్లు, ఉన్నతధాకారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సదస్సులో సింగరేణి డైరెక్టర్లతో పాటు మిగతా ఉన్నతాధికారులతో సీఅండ్ ఎండీ సుధీర్ణ చర్చలు కొనసాగించారు.

ఇక రానున్న నాలుగేండ్ల కాలంలో కొత్తగా 14 గనులు తెరవాల్సి ఉందని, అలాగే ప్రస్తుతం ఉన్న నాలుగు గనులను విస్తరించాల్సి ఉందని తెలిపారు.

ఈ క్రమంలో భారీ యంత్రాల పని గంటలు పెంచేందుకు ఆపరేట్లు, కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్పాదకత పెరిగేలా చూడాలని కోరారు.

కడప ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!