స్కేటింగ్ బోర్డుతో కళ్లు చెదిరే విన్యాసాలు.. వయసు నాలుగేళ్లే

కొంత మంది పిల్లలు తమ వయసుకు మించి ఎన్నో ఆశ్చర్యపోయే పనులు చేస్తుంటారు.

ఆ వయసు వారిలా కాకుండా ఎంతో నైపుణ్యంగా పనులు చేస్తుంటారు.పిల్లలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో, నేర్చుకున్న వాటిని ప్రదర్శించడంలో చాలా ఉత్సాహం చూపుతారు.

పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించే విధానాన్ని వారి పేరెంట్స్ వీడియోలు తీసి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెడుతున్నారు.

వారి ప్రతిభను నెటిజన్లు మెచ్చుకుంటుంటే చాలా సంబరపడిపోతున్నారు.తాజాగా రష్యా రాజధాని మాస్కోకు చెందిన ఒక చిన్న పిల్లవాడు అద్భుతమైన స్కేట్‌ బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు.

అతడి విన్యాసాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉణ్నాయి.

మాస్కో వీధుల్లో గుంపు ముందు స్కేట్‌ బోర్డింగ్‌ని చక్కగా వినియోగిస్తున్నాడు.'మిహోంచెస్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడి స్కేట్ బోర్డింగ్ విన్యాసాలను వీడియోలు తీసి పెడుతుంటారు.

అతని ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం బాలుడి వయస్సు నాలుగు సంవత్సరాల మూడు నెలలు మాత్రమే.

అయితే అతనికి ఇప్పటికే 1.15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

తాజాగా అతడు చేసిన విన్యాసాల వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. """/" / కళ్లు చెదిరేలా ఉండే అతడి విన్యాసాలకు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తాజా పోస్టుకు కేవలం రెండు రోజుల్లోనే 48.7K వ్యూస్ వచ్చాయి.

దీంతో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.పోస్ట్‌కి 3Kకి పైగా లైక్‌లు దక్కాయి.

బహుళ కామెంట్‌లు వచ్చాయి.చిన్నారి స్కేట్‌బోర్డింగ్ స్కిల్స్‌కి నెటిజన్లు బాగా ప్రశంసిస్తున్నారు.

1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!