పుల్వామా ఘటన జరిగి నేటికీ నాలుగేళ్లు మోడీ భావోద్వేగకర పోస్ట్..!!
TeluguStop.com
సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం జమ్మూకాశ్మీర్ లో పుల్వామా దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడటం జరిగింది.
ఈ ఘటనలో దాదాపు 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.శ్రీనగర్ జాతీయ రహదారిలో పేలుడు పదార్థులు నింపిన సైనికుల వాహనంపై ఆత్మహూతి దాడి జరిగింది.
ఈ దాడిలో 40 మంది జవాన్ లు మరణించడం జరిగింది.ఈ ఘటన యావత్ దేశాన్ని ఎంతో వేదనకు గురిచేసింది.
ఒక్కే దాడిలో 40 మంది సైనికులు కోల్పోవడం.ప్రపంచాన్నే కుదిపేసింది.
ఈ ఘటనని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఖండించారు. """/"/
కాగా ప్రతి ఏడాది పుల్వామా దాడి ఘటన స్మరించుకుంటూ.
దేశ ప్రజలు ఘన నివాళులు అర్పిస్తున్నారు.ఈ పుల్వామా దుర్ఘటన జరిగి నేటికీ నాలుగు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో.
ప్రధాని మోడీ సోషల్ మీడియాలో అమరులైన జవాన్ లను ఉద్దేశించి భావోద్వేగకర ట్వీట్ చేయడం జరిగింది.
"పుల్వామాలో మనం కోల్పోయిన వీరులను ఈరోజు స్మరించుకుంటున్నా.వారి అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం.
బలమైన అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించడానికి వారి ధైర్యం మనల్ని ప్రేరేపిస్తుంది" అని ట్విటర్ లో మోడీ ట్వీట్ చేశారు.