నేడు సాగర్ కు నలుగురు రాష్ట్ర మంత్రులు రాక…ఎడమ కాలువకు నీటి విడుదల…!

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ ప్రాజెక్టు( Nagarjuna Sagar Dam ) ఎడమ కాలువకు నీటిని విడుదల చేసేందుకు నేడు నలుగురు రాష్ట్ర మంత్రుల బృందం సాగర్ రానున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.

నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర భారీ నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ),రోడ్డు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ),వ్యవసాయ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం నేటి మధ్యాహ్నం 2.

30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3:20 గంటలకు నాగర్జున సాగర్ బుద్ధవనం దగ్గరున్న హేలిప్యాడ్ చేరుకుంటారని తెలిపారు.

మధ్యాహ్నం 3:40 గంటల నుండి 4:10 గంటల వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని విడుదల చేస్తారని,4:20 గంటల నుండి 5 గంటల వరకు నాగార్జున సాగర్ డ్యామ్ సందర్శించి, విజయ్ విహార్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని, 5:30 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరి తిరిగి హైదరాబాద్ వెళ్తారని పేర్కొన్నారు.

కుమార్తెను ఆసుపత్రికి తీసుకొచ్చిన డాక్టర్.. ఆమె చేసిన పనికి..?