న్యూయార్క్‌లో దారుణం: నలుగురు నిరాశ్రయుల దారుణహత్య
TeluguStop.com
న్యూయార్క్‌లో దారుణం జరిగింది.ఓ దుండగుడి చేతిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
నగరంలోని చైనాటౌన్‌తో పాటు లోయర్ ఈస్ట్ సైడ్ ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారే టార్గెట్‌గా ఒక ఇనుప రాడ్‌తో దుండగుడు దాడి చేశాడు.
రక్తపుమడుగులో పడివున్న వీరిని చూసిన స్థానికులు శనివారం తెల్లవారుజామున 1.50 గంటలకు 911కు ఫోన్ చేశారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.అయితే తలకు బలమైన గాయాలు కావడంతో వారు అప్పటికే మరణించారు.
ఘటనకు బాధ్యుడైన 24 ఏళ్ల దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 3 అడుగుల ఇనుప పైప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి సైతం నిరాశ్రయుడేనని.
అతని పేరు, ఇతర వివరాలు ఎవరికి తెలియదని పోలీసులు వెల్లడించారు. """/"/ మరోవైపు న్యూయార్క్ నగరంలో నిరాశ్రయులు, ఫుట్‌పాత్‌లపై నివసించే వారి సంఖ్య గత దశాబ్దంతో పోలీస్తే రికార్డు స్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఏడుగురు నిరాశ్రయులు దారుణ హత్యకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?