గుజరాత్‌లో నకిలీ డాలర్ల రాకెట్ గుట్టురట్టు .. నిందితుల్లో ఓ ఆస్ట్రేలియా పౌరుడు
TeluguStop.com
ప్రపంచంలో అన్ని దేశాలకూ సొంత కరెన్సీ ఉంది.కానీ లోకమంతా డాలర్( Dollar ) వెంట పరుగులు పెడుతుంది.
భూమ్మీద ఏ మూలకు వెళ్లినా డాలర్ చెల్లుతుంది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ, వాణిజ్యంపై డాలర్ ఆధిపత్యం పెరగడంతో అమెరికా సూపర్ పవర్‌గా నిలిచింది.
అందుకే అన్ని దేశస్థులకు డాలర్ అంటే మోజు.ఇందుకు భారతీయులు కూడా అతీతం కాదు.
డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు చలో అంటున్నారు.
ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో( Ahmedabad ) నకిలీ ఆస్ట్రేలియన్ డాలర్లను( Fake Australian Dollars ) ముద్రించి చెలామణి చేస్తున్న ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది.
నిందితుల్లో ఒక ఆస్ట్రేలియా నివాసి ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.అహ్మదాబాద్‌లోని వెజల్‌పూర్‌లో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నట్లుగా పక్కా సమాచారం అందటంతో అహ్మదాబాద్ పోలీస్ విభాగంలోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) ఈ రాకెట్‌ను ఛేదించినట్లుగా అధికారులు తెలిపారు.
"""/" /
రోనక్ రాథోడ్ (24)( Ronak Rathod ) అనే వ్యక్తి 119 కరెన్సీ నోట్లు (ఒక్కొక్కటి 50 డాలర్లు) ఆస్ట్రేలియా డాలర్లను మార్చేందుకు ప్రయత్నించగా పోలీసులు తొలుత అతనిని పట్టుకున్నారు.
ఖుష్ పటేల్ (24)( Khush Patel ) నుంచి కరెన్సీని అందుకున్నాడని చెప్పడంతో పటేల్‌ను అరెస్ట్ చేసి అతను ఇచ్చిన సమాచారం మేరకు మౌలిక్ పటేల్ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
20 ఏళ్ల విద్యార్ధి ధ్రువ్ దేశాయ్‌తో కలిసి మౌలిక్ పటేల్ వత్వాలోని ఒక చోట నకిలీ ఆస్ట్రేలియన్ డాలర్లను ముద్రిస్తున్నట్లుగా ఎస్‌వోజీ గుర్తించింది.
ఆ సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు 32 ఆస్ట్రేలియన్ డాలర్లను, పాక్షికంగా ముద్రించిన 18 షీట్లను స్వాధీనం చేసుకున్నారు.
"""/" /
అలాగే ఈ ముఠా నుంచి 90 వేల రూపాయల విలువైన అత్యాధునిక ప్రింటింగ్ మిషన్, డెస్క్‌టాప్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా కరెన్సీ ప్రింటింగ్ కోసం ప్రత్యేకమైన ప్లాస్టిక్ షీట్లను , నకిలీ ప్రక్రియ కోసం ఇతర వస్తువులను ఉపయోగించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
10 లక్షలు, రూ.16,500 విలువైన ఏడు మొబైల్ ఫోన్‌లు, రూ.
11,92,500 విలువైన నకిలీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?