ఆ 24 నిమిషాలు కోడెల ఎవరితో మాట్లాడాడు?
TeluguStop.com
ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే.జూబ్లీహిల్స్ పోలీసులు కోడెల మృతిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు.
ప్రముఖుడు అవ్వడం మరియు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా చేసిన వ్యక్తి అవ్వడం వల్ల పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని పలు విషయాలను సేకరిస్తున్నారు.
రెండు మూడు రోజుల్లోనే కేసును క్లోజ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాల గురించి తెలంగాణ పోలీసులు తీవ్రంగా ఎంక్వౌరీ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా కోడెల బయట వ్యక్తులను కనీసం కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు.
ఆయన్ను కలిసేందుకు వచ్చిన పలువురికి ఆయన మొహం కూడా చూపించకుండానే పంపించాడట.అయితే చనిపోయే ముందు రోజు మాత్రం 8 కాల్స్ మాట్లాడాడు.
అందులో చివరిది 24 నిమిషాల పాటు మాట్లాడాడు.కోడెల ఎవరితో అంత సమయం మాట్లాడాడు అనే విషయాన్ని పోలీసులు గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
24 నిమిషాలు ఫోన్ మాట్లాడిన తర్వాత చాలా డిస్ట్రిబ్ అయిన కోడెల రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మరి ఆ చివరి కాల్ ఎవరిది, ఎవరితో మాట్లాడాడు అనేది తెలియాల్సి ఉంది.
How Modern Technology Shapes The IGaming Experience