ప్రజల బాధలు చూసి చలించిన మాజీ జెడ్పిటిసి

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండల కేంద్రం నుండి తిమ్మారెడ్డిగూడెం, ఇసుకబాయిగూడెం, తోపుచెర్ల గ్రామాలకు వెళ్ళే రోడ్డు అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన మండల మాజీ జెడ్పిటిసి ఇరుగుదిండ్ల పద్మ భర్త గోవిందు స్పందించారు.

తమ సొంత నిధులతో రోడ్డు మరమత్తులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదని,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరమ్మతులు చేపడతామని చెప్పి విస్మరించారన్నారు.

ఈ రహదారిపై ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారని,ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామాలకు శాశ్వత రహదారిని నిర్మించి,వేములపల్లి ఎన్ఎస్పి కాలువ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరారు.

మాజీ జడ్పీటిసి చేపట్టిన రోడ్డు మరమ్మతులపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!