కరోనా వ్యాక్సిన్: వాలంటీర్లుగా ఒబామా, బుష్‌, క్లింటన్‌

కరోనా వైరస్‌కు టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.ఇప్పటికే కొన్ని దేశాల్లో పలు రకాల వ్యాక్సిన్లకు ఆయా ప్రభుత్వాలు ఆమోదం వేశాయి.

అయితే వాటిని తీసుకునేందుకు ప్రజలు భయపడిపోతున్నారు.వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా తగ్గుతుందా.

? ముందస్తు టీకా వల్ల కోవిడ్ మనల్ని ఏం చేయలేదా.? అసలు ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా.

? ఇలాంటి అనుమానాలు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి.అయితే వ్యాక్సిన్ అభివృద్ధి దశలో భాగంగా హ్యూమన్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్‌ల గుండె ధైర్యాన్ని అభినందించి తీరాల్సిందే.

మధ్యలో కొందరికి టీకా వికటించినా.మిగిలిన వారు మానవ శ్రేయస్సు కోసం ఏ మాత్రం భయపడకుండా ప్రయోగానికి సహకరించారు.

ఇప్పుడు ఇదే వాలంటీర్ల బాధ్యతను స్వీకరిస్తున్నారు.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా.

యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించిన అనంతరం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు వీరు ముగ్గురు అంగీకారం తెలిపారు.

తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని మాజీ అధ్యక్షులు భావిస్తున్నారు.

"""/"/ అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురి సాహసం కచ్చితంగా అమెరికన్లలో ధైర్యం నింపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కాగా సెప్టెంబర్ 11, 2001లో న్యూయార్క్‌లోని డబ్ల్యూటీవో టవర్స్‌ను ఆల్‌ఖైదా ఉగ్రవాదులు విమానాల సాయంతో పేల్చివేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన తర్వాత చాలా మంది అమెరికన్లు విమానంలో ప్రయాణించాలంటే వణికిపోయారు.దీంతో ప్రజల్లోని భయాన్ని పొగొట్టేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ తల్లిదండ్రులు.

దివంగత మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్.డబ్ల్యు.

బుష్, బార్బరా బుష్ ఒక వాణిజ్య విమానంలో ప్రయాణించారు.మరోవైపు అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది.

వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలలో చేరుతున్నవారి సంఖ‍్య రోజు రోజుకు పెరుగుతోంది.నిన్న ఒక్కరోజే 2731 మంది మహమ్మారికి బలయ్యారు.

కొత్తగా 1,95,121 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.దీంతో అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది.

రూ.1.50 కోసం 7 ఏళ్ల పోరాటం.. గ్యాస్ ఏజెన్సీకి దిమ్మతిరిగే షాక్!