ఎమ్మిగనూరులో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా కార్యాలయాన్ని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.

కార్యక్రమంకు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గైహాజరయ్యారు.గత కొద్దిరోజులుగా తెదేపాకు దూరంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ నేడు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు.

అనంతరం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎప్పుడు ఎంపీగానే పోటీ చేస్తా ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నారు.

పార్టీకి న్యాయం చేస్తాను కానీ ఎవరికి ద్రోహం చేయను.కార్యక్రమంకు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ని ఆహ్వానించడానికి అనేక సార్లు ఫోన్ చేసినా తాను కాల్ లిఫ్ట్ చేయలేదు.

మా ఇద్దరికీ ఎటువంటి విభేదాలు లేవన్నారు.రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలు వచ్చినా ఎమ్మెల్యే లు, మంత్రులు గ్రామాల్లో పర్యటించి రైతుల  సమస్యలు అస్సలు తెలుసుకోవడం లేదని ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

అందరికి అందుబాటులో ఉంటూ పార్టీ ను బలోపేతం చేస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో           ఖచ్చితంగా అధికారం చేపడతామని తెలిపారు.

చుండ్రును సంపూర్ణంగా త‌గ్గించే హోమ్ రెమెడీస్‌ ఇవి..!