బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి చెందినట్లు తెలుస్తుంది.
మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో రక్షణ,ఆర్ధిక,విదేశాంగ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్యం బారిన పడడం తో ఈ ఏడాది జూన్ 25 న ఢిల్లీ లోని ఆర్మీ దవాఖానా లో చేరినట్లు తెలుస్తుంది.
మల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్ సిండ్రోమ్ సెప్సిస్ చికిత్స పొందుతున్నారు.అయితే ఈ రోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉదయం 6.
55కు తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.బీజేపీ సీనియర్ నేతగా,పలు మార్లు కేంద్ర మంత్రిగా జశ్వంత్ సింగ్ పని చేశారు.
1980 నుంచి 2014 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఆయన ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.