బీజేపీ లోకి టీఆర్ఎస్ మాజీ ఎంపీ ? కేసీఆర్ బుజ్జగింపు కోసం...?
TeluguStop.com
పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల తంతు ఆసక్తికరంగా మారుతోంది.
ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని పార్టీలు ప్రచారంలోకి దిగిపోయి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులు నిమగ్నమయ్యాయి.
ఒక పార్టీని మరో పార్టీ ఏ విధంగా దెబ్బ తీయాలి ? ఏవిధంగా బలం పెంచుకోవాలనే విషయంపైనే దృష్టి సారించాయి.
ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మక కావడంతోనే ఈ స్థాయిలో ప్రతిష్టంభన ఏర్పడింది.
చోటా మోటా నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు వరకు అందరికీ ఈ ఎన్నికల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
పార్టీ మారి తమ పార్టీలోకి వస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తామో చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక కీలక నాయకులకు మంచి ఆఫర్లు పార్టీలు ప్రకటిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే , టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.
టిఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నరసయ్య గౌడ్ 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా టిఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి చెందారు.
ఇక మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ సీటు ను ఆశించినా దానిని కూసుకుంట్ల ప్రభాకర్ కు కేసీఆర్ ఇవ్వడం తో అప్పటి నుంచి నర్సయ్య గౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
బిజెపి నుంచి ఆయనకు పిలుపు రావడంతో , బిజెపి అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బూర నరసయ్య గౌడ్ భేటీ అయినట్లు వర్గాల ద్వారా తెలుస్తోంది.
"""/"/
మరో ఒకటి రెండు రోజుల్లో నర్సయ్య గౌడ్ బిజెపి కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .
అయితే బిజెపి అగ్ర నేతలను బూర నరసయ్య గౌడ్ కలిసినట్లు తనకు సమాచారం లేదని తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ ప్రకటించారు.
బీజేపీ జాతీయ పార్టీ అని, ఎవరైనా ఎప్పుడైనా చేరవచ్చు అంటూ ఆయన మాట్లాడారు .
ఇదిలా ఉంటే బూర నర్సయ్య గౌడ్ మాత్రం బిజెపిలో కి వెళ్లేందుకు దాదాపు సర్వం సిద్ధం చేసుకున్నారు.
కెసిఆర్ తనను పిలిపించి బుజ్జగిస్తారని, కీలక పదవులు విషయంలో హామీ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారట.
ఒకవేళ కెసిఆర్ కనుక తనను పిలవకపోతే బిజెపిలో చేరిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కెనడాపై అమెరికా పన్నులు పెంపు.. భారతీయ విద్యార్ధులపై ప్రభావం