బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న టీడీపీ..

బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న టీడీపీ

సామాన్య మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం మరో భారం మోపిందని, మొన్న గ్యాస్, పెట్రోల్ తదితర నిత్యావసరాలు, నిన్న విద్యుత్ ధరలు పెంచగా, నేడు తాజాగా ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసీ) టికెట్ చార్జీల పెంపునకు తెరతీసిందని, పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సు వరకు అన్నిటి పైన చార్జీలు పెంచేసిందని, ఆర్టీసీ చార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు శుక్రవారం పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పాడేరు కాంప్లెక్స్‌లో నుండి జి మాడుగుల వరకు బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులకు కరపత్రాలు పంచుతూ నిరసన తెలిపారు.

బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న టీడీపీ

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలపై మోయలేని భారం వేసి, ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న టీడీపీ

పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పాడేరు నుంచి జి, మాడుగుల వరకు బస్ లో నిరసన తెలిపారు.

ఇప్పటికే పెట్రో, గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడపై తాజాగా విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

తాజా సర్వేల ద్వారా సుమారు 87 శాతం కుటుంబాలకు అధిక ధరల సెగ తగిలిందన్నారు.

జగన్‌రెడ్డి ప్రభుత్వం బస్‌చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దారుణమన్నారు. """/"/ బాదుడే బాదుడుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, వైసీపీకి చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

పన్నుల పేరుతో సీఎం జగన్‌ ప్రజలను పీక్కు తింటున్నారన్నారన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా, వెంకట సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సోమేలి చిట్టిబాబు, టిడిపి అరకుపార్లమెంట్ అధికార ప్రతినిధి గంగపూజరి శివకుమార్, అరకు పార్లమెంట్ మహిళ కార్యదర్శి గబ్బడి శాంతి కుమారి, జి మాడుగుల మండల ప్రెసిడెంట్ వంతల కొండలరావు, తెలుగు యువత నియోజకవర్గ నాయకులు వర్తన నీలకంఠం, కీముడు కల్యాణం, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్కూల్‌లో స్టూడెంట్‌ను చితకబాదుతుంటే.. చూస్తూ నిలబడ్డ పెద్దలు.. టెక్సాస్‌లో దారుణం!

స్కూల్‌లో స్టూడెంట్‌ను చితకబాదుతుంటే.. చూస్తూ నిలబడ్డ పెద్దలు.. టెక్సాస్‌లో దారుణం!