చదువుకు సాయం చేసిన మాజీ సర్పంచ్
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామం నుండి పదవ తరగతి పరీక్షలకు వెళుతున్న విద్యార్దులకు సరైన రవాణా సౌకర్యం లేక రోజూ ఇబ్బంది పడుతున్నారు.
ఈ విషయం తెలుసుకొని గ్రామ మాజీ సర్పంచ్ బీరప్ప పరీక్షలు ముగిసే వరకు వారిని పరీక్షకు తీసుకెళ్లి,తిరిగి గ్రామానికి తీసుకొచ్చేలా ఒక ఆటో సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుండి టెన్త్ పరీక్షలకు( Tenth Exams ) వెళ్ళే పిల్లలు రవాణా సౌకర్యం లేక,పరీక్షా సమయానికి సెంటర్ కి చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి,పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఒక ఆటో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరీక్షలు రాసి,మంచి మార్కులతో పాసై, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు.
ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.బీరప్ప సేవా గుణానికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players