పాకిస్తాన్ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ..!!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (PTI) సత్తా చాటింది.

11 నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో ఎనిమిది స్థానాలలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI గెలవడం జరిగింది.

ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే ఏడు స్థానాలలో పోటీ చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో కూలిపోయింది.

దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోవడం జరిగింది.అయితే ఈ ఉప ఎన్నికలను ఆయన రెఫరండంగా భావించారు.

దీంతో అత్యధిక స్థానాలు గెలవడంతో .తమపై ప్రజలకు విశ్వాసం ఉందని ఎన్నికలు నిరూపించినట్లు PTI నేతలు అభిప్రాయపడుతున్నారు.

ప్రతిపక్షంలో ఉండి ఈ రీతిలో విజయం సాధించడం మామూలు విషయం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జరిగిన 11 నియోజకవర్గాల ఉప ఎన్నికలలో అధికారపక్షం కేవలం ఒకే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.

వచ్చే ఏడాది అక్టోబర్ లో పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ జరిగిన ఈ ఉప ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలవడంతో పాకిస్తాన్ దేశంలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి.

యూకే: వావ్, ఈ గులాబీ రంగు గొల్లభామను చూశారా.. చాలా అరుదట..