తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

తిరుమల: తిరుమల శ్రీవారిని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయ్ హవా.. బాలయ్య ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారుగా!