2024 ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేసిన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..!!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే 2024 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

కొద్దిరోజుల క్రితం నవంబర్ 15వ తారీకు సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలపడం జరిగింది.

ఈ క్రమంలో వచ్చే అధ్యక్ష ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు చెప్పటంతో ఆయన మద్దతుదారులు 2024 అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ కి పేపర్లు సమర్పించారు.

దీంతో వచ్చే ఎన్నికల అభ్యర్థత్వం కోసం పోటీకి దిగుతున్న మొదటి పోటీదారుడుగా పత్రాలు సమర్పించారు.

2016 ఎన్నికల సమయంలో "అమెరికా గ్రేట్ ఎగైన్" అనే నినాదంతో పోటీ చేశారు.

కాగా ఇప్పుడు 2024ఎన్నికలకు "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల కోసం తన అభ్యర్ధిత్వని ప్రకటించినట్లు తెలిపారు.గత సార్వత్రిక ఎన్నికలలో అధ్యక్షుడిగా  ట్రంప్ పోటీ చేసి ఓడిపోయారు.

అయితే తన ఓటమి విషయంలో మీడియా ఇంకా కొంతమంది కుట్ర చేసినట్లు ఆరోపించారు.

దీంతో వచ్చే అధ్యక్ష ఎన్నికలను డోనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.

ఈ క్రమంలో ట్రూత్ అనే సోషల్ మీడియాలో.తన అధ్యక్ష ఎన్నికల అభ్యర్ధిత్వనీ  తెలియజేస్తూ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని పోస్ట్ పెట్టడం జరిగింది.

దీంతో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షా అభ్యర్ధిత్వ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రోజు ఉదయం ఈ పొడిని తీసుకుంటే మలబద్ధకం సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు!