200 మంది మహిళలను చంపిన మాజీ పోలీస్.. అత‌ను చెప్పిన రీజ‌న్ వింటే షాక్‌..

ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి తన సహనాన్ని కోల్పోతున్నాడు.ఆవేశంలో నేరాలు చేస్తుంటారు.

కోపం చల్లారిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు చాలా మంది.కొందరు తర్వాత పశ్చాత్తాపడతారు.

మరి కొందరు దానిని పట్టించుకోకుండా ఎదురొచ్చిన వారిని సైతం ఇబ్బందులకు గురిచేస్తుంటారు.వారిపై దాడి చేయడానికి కూడా వెనుకాడరు ఇలాంటి వారు చాలా డేంజరస్.

వీరి ఆలోచనలు చాలా క్రూయల్ గా ఉంటాయి.అనుకున్నదే పనిగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటారు.

ఇలాంటి కేటగిరికి చెందిన ఓ డేంజరస్ సీనియర్ కిల్లర్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.

రష్యాలోని మిఖాయిల్ పాప్కోవ్ అనే వ్యక్తి సుమారు 200 మంది మహిళలను కిరాతకంగా హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి.

ఇంతకన్నా షాకింగ్ విషయం ఏంటంటే అతడు ఓ మాజీ పోలీస్ అధికారి.అతడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

హత్యలు చేసేందుకు ఓ కారణముందని విచిత్రమైన రీజన్ చెప్పాడు.హత్య చేసే ముందు మహిళలను ఈ కిల్లర్.

చాలా దారుణంగా హింసించేవాడట.హత్య చేసేందుకు అతడు సుత్తెను ఉపయోగిస్తుండేవాడట.

"""/" / వారిని చంపే ముందు వారిపై అత్యాచారం సైతం చేసేవాడట.వారిని చంపిన తర్వాత బాడీ ముక్కలు ముక్కలుగా చేసేవాడట.

అతడు ఓ పోలీస్ కావడంతో అతడిపై ఎవరికీ అనుమానం రాలేదు.చివరకు అతడే నేరస్తుడని తెలియడంతో జైలు పాలయ్యాడు.

జీవిత ఖైదు పడినా అతడు పశ్చాత్తాపం పడటం లేదట.ఇప్పటికే 22 మంది మహిళల హత్య కేసుల్లో నేరస్తుడని రుజువుకాగా, మరి కొన్ని విచారణలో ఉన్నాయి.

హత్యలు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించగా.చెత్తను క్లీన్ చేస్తున్నానని అతడు చెప్పడం గమనార్హం.

వింటుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదా.ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆ దేశంలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

మరి మిగిలిన కేసుల్లోనూ ఇతడు దోషిగా తేలుతాడో లేదో చూడాలి.

రీల్ కోసం ప్రాణాల‌తో చెల‌గాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!