అనర్హత వేటుపై ఇస్లామాబాద్ హైకోర్టుకు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఎన్నికల కమిషన్ తనపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

తోషాఖానా రిఫరెన్స్‌లో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు ఇమ్రాన్‌పై ఈసీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

విదేశీ నేతలు, ప్రతినిధుల నుంచి స్వీకరించిన ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్ముకున్న నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది.

దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోవడంతో పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడయ్యారు.అయితే, ఈసీ నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

అత్యవసరంగా కేసును విచారించాలని న్యాయస్థానాన్ని ఆయన తరపు న్యాయవాది జఫర్ కోరారు.ఇమ్రాన్ అప్పీల్‌ను కోర్టు విచారణకు స్వీకరించినప్పటికీ, అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అనంతరం తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.

రియల్ లైఫ్ లో నాన్నకు ముఫాసాతో పోలికలు.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!