నులి పురుగుల నివారణ కోసం మాత్రలు వేసిన మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట( Kishan Das Peta ) లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 160 మందికి పైగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం నులి పురుగుల నివారణ మాత్రలను స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ మాత్రలను విద్యార్థులకు వేశారు.

ఇప్పుడు వేసుకోని విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ నెల 10న తిరిగి మళ్లీ వేయడం జరుగుతుందని ఏ ఎన్ ఎం శారద తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల పాధ్యాయురాలు అంజలి, శ్రీనివాస్,ఆశా వర్కర్ లక్ష్మి పాల్గొన్నారు.

బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు వేసిన వేణుస్వామి.. షో గురించి అలా చెబుతూ?