మాజీ ఎంపీటీసీ చొరవ సిరిసిల్ల- సిద్దిపేట బస్సు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేం మీదుగా సిరిసిల్ల( Sirisilla ) ఆర్టీసీ డిపోకు చెందిన బస్ సిరిసిల్ల నుండి సిద్దిపేటకు వయా ఎల్లారెడ్డిపేట ,నారాయణపూర్ ,బండ లింగంపల్లి ,మీదుగా ముస్తాబాద్ సిద్దిపేట వరకు ఆర్టీసీ బస్సును ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్ రిబ్బన్ కట్ చేసి బస్సు ప్రారంభం చేశారు.

సిరిసిల్ల నుండి సిద్దిపేట వరకు అదేవిధంగా హైదరాబాద్ యాదగిరిగుట్ట కొమరవెల్లికి( Hyderabad ) బస్సును నడపాలని కోరుతూ ఇటీవల టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ను హైదరాబాద్ లోని బస్సు భవన్లో కలిసి ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం సమర్పించారు .

వెంటనే స్పందించి రూట్ సర్వే చేయాలని సిరిసిల్ల డిపో అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయగా ఇటీవల బస్ రూట్ సర్వే కూడా నిర్వహించారు.

అనంతరం ఎల్లారెడ్డిపేట బస్టాండ్ నుండి సిద్దిపేటకు బస్సును ప్రారంభించారు .ఎల్లారెడ్డిపేట బస్టాండ్ వద్ద బస్సును కొబ్బరి మట్టలతో అలంకరించి మామిడాకుల తోరణాలతో అలంకరించి ప్రారంభించారు.

మొదటగా సిద్దిపేట వరకు ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజ్ యాదవ్ , జెడ్ పి టి సి చీటీ లక్ష్మణరావు లు బస్సు టిక్కెట్ కొనుగోలు చేసి బస్సులో ప్రయాణించారు.

నూతనంగా ప్రారంభమైన బస్సుకు నారాయణపూర్ గ్రామం లో మధు,తో పాటు గ్రామస్థులు, బండ లింగంపల్లిలో అక్కడఎంపీటీసీ కొత్త పెళ్లి పద్మ దేవయ్య, బండ లింగంపల్లి వార్డ్ సభ్యులు హైమద్ ,బాలచందర్ యాదవ్ లతో పాటు రెండు గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు .

బస్సు ఏర్పాటుకు సహకరించిన ఆర్టిసి ఎండి సజ్జనారుకు సిరిసిల్ల డిపో మేనేజర్ కు ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్ , వైస్ ఎంపీపీ కదిర భాస్కర్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి ,వార్డు సభ్యులు దేవేందర్ పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా కాంగ్రెసు నాయకులు వంగగిరిధర్ రెడ్డి ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సిత్యా నాయక్, బిజెపి నాయకులు నేఊరి శ్రీనివాస్ రెడ్డి ,అఫ్జల్, ఎనగందుల బాబు, నూకల శ్రీనివాస్ యాదవ్ , బిజెపి నాయకులు బంధారపు లక్ష్మారెడ్డి ,దూస శ్రీనివాస్ నాయక్ ,ఎనగందుల దేవరాజ్, సిరిసిల్ల డిపో ఎస్ టి ఐ సారయ్య ,సేఫ్టీ ఆఫీసర్ పరశురామ్ పాల్గొన్నారు.

’ బస్సు బయలుదేరు సమయం బస్సు డిపో నుండి ఉదయము 6:45 గంటలకు ప్రారంభం అయి వేములవాడకు 6.

55 నిమిషాలకు చేరుకొని అక్కడి నుండి 7:25 గంటలకు ప్రారంభమై సిరిసిల్లకు 7:45కు చేరుకుంటుందని అక్కడి నుండి ఎనిమిది గంటలకు ప్రారంభమై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మీదుగా బండ లింగం పెళ్లి నుండి ముస్తాబాద్ కు 9:15 గంటలకు చేరుకుంటుంది అక్కడి నుండి 9:30 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు 10 30 గంటలకు చేరుకుంటుందని టీఎస్ ఆర్టిసి సూపరిండెంట్ ఎల్ రామ్ రెడ్డి నాయక్ తెలిపారు తిరిగి ముస్తాబాద్ కు 11:45 కు చేరుకుంటుందని 12 గంటలకు బయలుదేరి వేములవాడకు ఒకటి 35 గంటలకు చేరుకుంటుంది అక్కడి నుండి సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మీదుగా ముస్తాబాద్ కు మధ్యాహ్నం మూడు 45 గంటలకు చేరుకుంటుంది నాలుగు గంటలకు బయలుదేరి సిద్దిపేటకు ఐదు గంటలకు చేరుకుంటుంది అక్కడి నుండి ముస్తాబాద్ కు 6:30 కి చేరుకొని అక్కడి నుండి 6:45 కు బయలుదేరి సిరిసిల్లకు 8 గంటలకు వెళుతుందని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

బస్ ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ను ఎల్లారెడ్డి పేట, నారాయణపూర్.

బండలింగంపల్లి గ్రామాల ప్రజలు ఆయనను అభినందించారు.

సుజీత్ ను బాగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్…కారణం ఏంటి..?