కరెంట్ బాధిత కుటుంబాలకు మాజీ ఎంపీటీసీ పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురువారం కరెంట్ హై ఓల్టేజ్ కారణంగా గ్రామంలో గల ఒకటవ,రెండవ వార్డులో ఒక్కసారిగా హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో సుమారు 70 మందీ ఇండ్లలో గల ఫ్యాన్లు,కూలర్ లు ఏసి,ల్యాప్ టాప్ లు కాలి బూడిదయ్యాయి.

దీంతో బాధితులకు సుమారు 25లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాదితులు మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పిర్యాదు చేశారు.

ఇదే వార్డులో గత ఏడాది కూడా ఇలాగే హై ఓల్టేజ్ కారణంగా ఇట్లాగే కాలిపోయాయని తిరిగి మళ్ళీ మా ఏరియాలోనే ఇట్లా హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా కావడం లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లడం చాలా దురదృష్టకర సంఘటన అని కరెంట్ బాధితులతో మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.

ఎల్లారెడ్డిపేటతో పాటు మండలంలో ఎక్కడ కూడా ఇలా హై,లో ఓల్టేజ్ కారణంగా ఇలా వస్తువులు కాలిపోతే వారికి నష్ట పరిహారం అందేలా సెస్ పాలక వర్గం సమావేశంలో తీర్మానం చేయాలని జనగామ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి కి పోన్ ద్వారా కోరగా సెస్ పాలకవర్గ సమావేశంలో పాలకవర్గం దృష్టికి తీసుకు వెళతానని సెస్ డైరెక్టర్ హామీ ఇచ్చారనీ తెలిపారు.

బన్నీని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!