ఉపాధ్యాయుడికి స్వాగతం పలికిన మాజీ ఎంపీటీసీ, విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ( మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు నూతనంగా ఇదే మండలం నారాయణ పూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 14 సంవత్సరాల పాటు పనిచేసిన మిట్టపెల్లి ప్రశాంత్ కుమార్ ఇక్కడి పాఠశాలకు బదిలీ పై వచ్చిన సందర్భంగా ప్రశాంత్ కుమార్ ( Prashant Kumar )కు స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు విద్యార్థులు పుష్ప గుచ్చము ఇచ్చి స్వాగతం పలికారు.

విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని,పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని, ప్రభుత్వం నుంచి మౌళిక వసతుల కల్పన కోసం తాను కృషి చేస్తానని బాలరాజు యాదవ్ అన్నారు.

మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,అంజలి ఉన్నారు.

ప్రమోషన్స్ విషయంలో బన్నీకి బన్నీనే సాటి.. మిగతా హీరోలు ఈ విషయంలో మారతారా?