బ్రేకింగ్: కరోనా బారిన పడి మరణించిన మాజీ ఎంపీ సబ్బం హరి..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రాణించిన మాజీ ఎంపీ ప్రస్తుత టీడీపీ నేత సబ్బం హరి కొద్దిసేపటి క్రితం మరణించారు.

ఇటీవల కరోనా బారిన పడిన ఆయన  విశాఖపట్నంలో ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

అయితే అప్పటికే పరిస్థితి విషమించటంతో కొద్దిరోజులుగా వెంటిలేటర్ పై ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు.

ఆయనకు భార్యముగ్గురు పిల్లలు ఉన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీలో రాణించిన ఆయన విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఆ తర్వాత 2019 ఎన్నికల టైంలోతెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి  భీమిలి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో సబ్బం హరి మరణించడం పట్ల టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు కీలక నేతలు.

సంతాపం వ్యక్తం చేశారు.హాస్పిటల్లో జాయిన్ అయిన నాటి నుండి సబ్బం హరి యొక్క ఆరోగ్య వివరాలను చంద్రబాబు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు.

ఇంతలోనే ఆయన మరణించడంతో చంద్రబాబు ఆవేదనకు గురైనట్లు సమాచారం.కరోనా తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండటంతో సబ్బం హరి ఆరోగ్యం విషమిన్చినట్లు అందుకే మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

 ఉత్తరాంధ్రలో కీలక నేతగా రాణించడంతో ఆ ప్రాంతానికి చెందిన చాలామంది రాజకీయ నేతలు సబ్బంహరి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 .

భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న గీతూ రాయల్.. 40 ఏళ్లకే చనిపోతారంటూ?