కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి పోడు భరోసా యాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోడు భరోసా యాత్ర కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పొంగులేటి ఆరోపించారు.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.పట్టాలు ఇవ్వకుండా అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తున్నారని విమర్శించారు.

పోడు పట్టాల కోసం సుమారు నాలుగు లక్షల కుటుంబాలు నిరీక్షిస్తున్నాయని చెప్పారు.అర్హులకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కిరణ్ అబ్బవరం క సినిమా సక్సెస్ సాధించిందా..?