వైఎస్ఆర్‎టీపీలోకి మాజీ ఎంపీ పొంగులేటి..?

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి వైఎస్ఆర్‎టీపీలోకి వస్తారని వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు నిజం కానున్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి వైఎస్ఆర్‎టీపీ కండువా కప్పుకోనున్నారా.? అన్న విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

వైఎస్ విజయమ్మతో పొంగులేటి వరుస మంతనాలు జరుపుతున్నారు.దీంతో పొంగులేటి పార్టీ మార్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఈనెల 8న ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 8న లేదా పాలేరులో నిర్వహించనున్న షర్మిల పాదయాత్ర ముగింపు సభలో పొంగులేటి చేరికపై స్పష్టత రానుంది.

అయితే తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పొంగులేటి వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ దర్శకులు రాజమౌళి దారిలోనే నడుస్తున్నారా..?