షర్మిల సిఎం అవుతారంటున్న టీఆర్ఎస్ మాజీ ఎంపీ !

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరిష్కరించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న వైస్ షర్మిల తెలంగాణలో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు.

పాదయాత్రలు,  ధర్నాలు,  ఆందోళన కార్యక్రమాలు ఇలా అన్ని చేపడుతూ ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించి,  2023 ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తుండగా , ఆ పార్టీలోకి ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడం, పార్టీ నుంచి బయటికి వెళ్లే వారే తప్ప,  వేరే నాయకులు కనిపించకపోవడం ఇలా చాలా కారణాలతో ప్రధాన పార్టీల నాయకులు పెద్దగా పట్టించుకోవడమే మానేశారు.

  ఇదిలా ఉంటే తాజాగా షర్మిల తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు అని, టిఆర్ఎస్ మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్ ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీఎస్ చాలాకాలంగా అనారోగ్యంతో ఉండడం తో ఆయన్ను పరామర్శించేందుకు షర్మిల వెళ్లారు.ఈ సందర్భంగా షర్మిల ను డీఎస్ పొగడ్తల తో ముంచెత్తారు.

ఈ సందర్భంగా షర్మిల డిఎస్ మధ్య ఆసక్తికర రాజకీయ చర్చ జరిగినట్లు సమాచారం.

తెలంగాణ రాజకీయాలతో పాటు , దేశ రాజకీయాల పైన వీరిద్దరూ చర్చించుకున్నారట.ఈ సందర్భంగా షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న డిఎస్ 2003లోని తాను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారట.

  """/"/  వైయస్సార్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుభవాలు, సానుహిత్యం గురించి ఈ సందర్భంగా షర్మిల వద్ద డిఎస్ వద్ద ప్రస్తావించారట.

తెలంగాణ ప్రజలలో వైయస్సార్ పై అభిమానం ఇప్పటికీ చెక్కుచెదరలేదని,  సరైన సమయంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందని చెబుతూ, షర్మిలను ఐరన్ లేడీగా డిఎస్ అభివర్ణించారు.

తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానని షర్మిల తప్పకుండా ముఖ్యమంత్రి అవుతుందని, భవిష్యత్తులో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అవుతుందంటూ డిఎస్ జోస్యం చెప్పారు.

  ప్రస్తుతం షర్మిలపై డిఎస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.డిఎస్ కుమారుడు ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్నారు.

షర్మిల అరవింద్ మధ్య అనేకసార్లు రాజకీయంగాను విమర్శలు,  ప్రతి విమర్శలు చోటు చేసుకోగా ఇప్పుడు డీఎస్ ఈ విధంగా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

పాక్‌లో బయటపడ్డ భారీ చమురు, గ్యాస్ నిల్వలు.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్లే..?