ప్రజలు ఆశించినట్టు జనసేన పని చేయడం లేదని కీలక వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత.. ?

జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది.సొంత పార్టీ నేతనే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఈ పార్టీకి రాజీనామ చేసారు.

ఆ వివరాలు చూస్తే.జనసేన పార్టీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా పని చేసి, ప్రస్తుతం ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రాజీనామా చేశారు.

తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవడం లేదని, ప్రజలు ఆశించినట్టుగా జనసేన పని చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు.

కాగా సినిమాలు, రాజకీయాలు వేవేరు రని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను పని చేయలేనని వ్యాఖ్యానించారు.

కాగా జనసేన అధినేత పవన్ తెలుగుదేశంకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతున్న కూడా ఈ వార్తలను ఏ మాత్రం ఆయన ఖండించడం లేదని అలా మౌనంగా ఉండటం నిజాన్ని అంగీకరించినట్టుగా భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుందని గంగాధరం అన్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!