మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలి:కాంగ్రెస్ సేవాదళ్

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సేవాదళ్ యంగ్ బ్రీగేడ్ జిల్లా అధ్యక్షుడు కాసర్ల గణేష్ అన్నారు.

గురువారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

మాజీ ఎమ్మెల్యే కిషోర్ తన స్థాయిని మరిచి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గాదరి కిషోర్ కుమార్ కు నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ స్థాయిని మరిచి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు మరోసారి రానున్న పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

స్థాయిని మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ దగ్గర మెప్పు పొందవచ్చనే భావనతో ఇష్టానుసారంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని,నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

లేకుంటే కిషోర్ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామన్నారు.ఈ సమావేశంలో అర్వపల్లి మండల అధ్యక్షుడు గైగుల్ల శీను,నిమ్మనకోటి గణేష్, శ్రీకాంత్,పెసర మహేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

భార్య టాటూను తొలగించుకున్న దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్.. కారణాలివేనా?