MLA Balka Suman : కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( MLA Balka Suman ) మరోసారి విమర్శలు గుప్పించారు.

తను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని తనపై కేసు పెట్టారని తెలిపారు.ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేసిన వ్యాఖ్యలపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని మండిపడ్డారు.కేసీఆర్ ను ఇష్టమొచ్చినట్లు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న ఆయన కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అని విమర్శిచారు.

ఈ నేపథ్యంలోనే తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

న్యూజిలాండ్ బీచ్‌లో వింత తిమింగలం.. చూసి షాక్ అవుతున్న స్థానికులు..