వైఎస్ వివేకా హత్య కేసులో ఒక్కొక్కటిగా డొంక కదులుతోంది.. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

వైఎస్ వివేకా హత్య కేసులో ఒక్కొక్కటిగా డొంక కదులుతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.

అనంతపురంలోని తేదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వివేకా హత్య కేసు సిబిఐ అధికారుల విచారణలో కొత్త మలుపులు చూస్తున్నామన్నారు.

అవినాష్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినా.సొంత చిన్నాన్న విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

కొంతమంది తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోందన్నారు.గతంలో తేదేపా నాయకుడు చంద్రబాబు, లోకేష్ పైన ఆరోపణలు చేశారన్నారు.

ఈ హత్య కేసులో ఇరికించడానికి అనేక కుట్రలు చేశారని చెప్పారు.ఇప్పుడు కుటుంబ సభ్యులే 40 కోట్లు సుఫారీ తో హత్య చేయించినట్లు సమాచారం సాగుతోందన్నారు.

అవినాష్ రెడ్డి ని విచారించాలన్నారు.జగన్ హామీతోనే హత్య జరిగి ఉంటుందని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

సీఎం జగన్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇండస్ట్రీ హిట్ మూవీ కల్కికి ఆ డీల్ పూర్తి కాలేదా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ అంటూ?