17వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి..

17వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.

ప్రభుత్వ ఉద్యగులకు సంక్షేమ పథకాలు ఇవ్వటం కుదరదు.జనసేన కమ్యూనిస్టు పార్టీలు రాద్ధాంతం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు.

గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాము.

మంత్రి గా ఫెయిల్ అయిన నారా లోకేష్ పాదయాత్ర చేసిన మోకాళ్ళ యాత్ర చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతించరు.

చంద్రబాబు,లోకేష్ లని ఆంధ్ర ప్రజలు నమ్మరు.స్థానిక 45వ డివిజన్ లోని 136వ సచివాలయం పరిధిలో 17వ రోజు మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని లంకిరెడ్డి తాటి రెడ్డి విధి,రెడ్డి మోహన్ స్ట్రీట్,న్యూ భగత్ సింగ్ నగర్,బ్రహ్మయ్య నగర్,శ్రీ నిధి శాంతి నగర్ కాలనీ,రోటరీ నగర్ మరియు తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రోటరీ నగర్ లో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.

ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ సచివాలయం పరిధిలో రొండో రోజు కూడా పర్యటించడం జరిగిందన్నారు.

నేటికీ 9 సచివాలయల పరిధిలో తిరగడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా పేదలకు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందడం లేదు వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.

ఈ ప్రాంతంలో కొంత త్రాగునీరు సమస్య వుందని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.

వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు.కొంత ఈ ప్రాంతంలో రోడ్లు క్రిందకు వుండటం వల్ల డ్రైనేజ్ సమస్య వుందని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.

రాజకీయ పార్టీలకు రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయి ఈ కార్యక్రమాన్ని రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు.

ప్రభుత్వ ఉద్యగులకు సంక్షేమ పథకాలు ఇవ్వటం కుదరదన్నారు ఈ ప్రాంతంలో ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వుండి సొంత ఇల్లు వుండి సంక్షేమ పథకాలు కావాలని రాద్ధాంతం చేయడం హేయమన్నరు.

జనసేన కమ్యూనిస్టు పార్టీలు రాద్ధాంతం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మేము ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

ప్రజలకు మంచి చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.మంత్రి గా ఫెయిల్ అయిన నారా లోకేష్ పాదయాత్ర చేసిన మోకాళ్ళ యాత్ర చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతించారు అన్నారు.

లోకేష్ నీ చంద్రబాబు నీ ఆంధ్ర ప్రజలు నమ్మే పరిస్తితి లేదన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు కృష్ణ,ముత్యాల రాంబాబు,ప్రసాద్,బుర మళ్ళీ,ముత్యాల లక్ష్మి,కోటేశ్వర రావు,మీరా,సోషల్ వర్కర్ రాము, కట్టా సత్తి,గంగవరపు మురళి, మల్లేశ్వర రెడ్డి, ముత్త వాసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు,పార్టీ నాయకులూ, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్ మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మరోసారి ఆ సెంటిమెంటునే నమ్ముకున్న చిరంజీవి…