బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై మాజీ మంత్రి తుమ్మల గరంగరం
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తనకు టికెట్ కేటాయించకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా వ్యవహారిస్తున్న తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మరోవైపు పాలేరు నుంచే పోటీ చేయాలని తుమ్మలపై అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే నాయుడుపేటలో పాలేరు నియోజకవర్గం తుమ్మల అనుచరులు భేటీ అయ్యారు.తుమ్మల పార్టీకి రాజీనామా చేయాలంటూ అనుచరులు సమావేశంలో తీర్మానించారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుమ్మల వర్గీయులు రాజీనామాకు సిద్ధం అయ్యారని సమాచారం.
దీంతో తుమ్మలను బుజ్జగించేందుకు మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారని తెలుస్తోంది.ఈ పరిస్థితులతో ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?