నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పల్లారావు పూజాలు..
TeluguStop.com
పల్నాడు జిల్లా: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజా కార్యక్రమాలు చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి పల్లారావు.
చిలకలూరిపేటలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రతిపాటి పుల్లారావు,టీడీపీ నేతలు.మాజీమంత్రి పత్తిపాటి కామెంట్స్ - తారకరత్న త్వరగా కోలుకోవాలని ఈరోజు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించాము.
ఆయన ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు.సినిమా పరిశ్రమలో ఆయన అవసరం చాలా ఉంది.
హీరోగా పలు చిత్రాలు నటించిన గొప్ప నటుడు.ఈరోజు ఆరోగ్య ఇబ్బందుల వల్ల హాస్పిటల్లో ఉన్నారు.
వారు త్వరగా కోలుకొని మామూలు మనిషి లాగా.ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా బయటికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.
లోకేష్ యువ గళం మీద రాష్ట్ర మంత్రులు అవాక్కు చవాకులు పేలుతూ ఉన్నారు.
లోకేష్ యువ గళం అనగానే వైఎస్ఆర్సిపి పార్టీలో గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.బొత్స సత్యనారాయణ ఇంకా కొంతమంది మంత్రులు లోకేష్ యువ గళం మీద పని కట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు.
"""/" /
మీకు సంబంధించిన ఇండియా టుడే సర్వే లోనే మీ గ్రాఫ్ పడిపోయింది.
50 నుంచి 30 శాతానికి పడిపోయిన మీరు లోకేష్ విమర్శించే స్థాయి మీకు లేదు.
లోకేష్ వైఎస్ఆర్సిపి పార్టీని బంగాళాఖాతంలో కలపటానికి యువగలం యాత్ర చేస్తూ ఉన్నాడు.రాష్ట్ర మంత్రులు లోకేష్ బాబు ని చూసి ఎందుకు ఉలిక్కి పడుతున్నారో మాకు అర్థమవ్వట్లేదు.
మీ రౌడీ పాలన ఆపి ఇకనైనా ప్రజలకు సేవ చేయండి.వారు మీకు ఓటు వేసినందుకు తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో యువకులు, పెద్దలు మహిళలు.ఉద్యోగస్తులు ఈ పార్టీని ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురుచూస్తున్నారు.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters