డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి మంత్రి బొత్సపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ పోస్ట్..!!
TeluguStop.com
టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Former Minister Ganta Srinivasa Rao ) మంత్రి బొత్స సత్యనారాయణ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification ) పై నిలదీస్తూ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.
"అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ.ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ అప్పుడు ప్రతిపక్ష నేతగా హామీల వరద కురిపించారు.
ఇప్పుడు అధికారం లోకి వచ్చి 4 ఏళ్ల 7 నెలలు అవుతుంది.ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యం లో విద్యాశాఖ మంత్రి మరో రెండు మూడు రోజుల్లో “డీఎస్సీ పై గుడ్ న్యూస్” అని అన్నారు.
రెండు మూడు రోజులు అయిపోయాయి.గుడ్ న్యూస్ ఎక్కడ? నోటిఫికేషన్ ఎప్పడు విడుదల చేస్తారు? మరి టెట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ? రాత పరీక్ష ఎప్పడు నిర్వహిస్తారు? ఎప్పడు పోస్టులు భర్తీ చేస్తారు ? ఎన్నికలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయగలరా? ఎందుకు ఈ వట్టి వాగ్దానాలు? నిరుద్యోగులను ఎన్ని రోజులని మభ్యపెడతారు?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఈ ప్రభుత్వానికి అలావాటుగా మారింది.
ఇదేనా మీ చిత్తశుద్ధి? 2014లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన వెంటనే 9061 పోస్టులతో, 2018లో 7729 పోస్టులతో మెగా డీఎస్సీలు ప్రకటించి వేలాది నిరుద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది.
1998, 2008 డీఎస్సీ లో సెలెక్ట్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులు, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఎప్పట్నుంచో వారు పోరాటం చేస్తున్నారు.
కనీసం వారి ఉద్యోగాలనుఅయినా రెగ్యులరైజ్ చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.నిరుద్యోగుల భవిష్యత్తుకి ఏం ఢోకా లేదు.
2024 లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే.రాష్ట్రంలో అన్నీ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే".
అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోస్ట్ పెట్టడం జరిగింది.
అల్లు అర్జున్ ను ఆదర్శంగా తీసుకుంటే అందరూ పాన్ ఇండియా హీరోలే అవుతారా..?