వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే - మాజీమంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి

మాజీమంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కీలక వ్యాఖ్యలు.నేను వైసీపీలోనే ఉన్నా.

వారేమీ నన్ను తీసేయలేదు.రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదు.

పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు.ఆ పార్టీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉంది.

ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే.గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నా.

రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరు.పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేం.

"""/"/ రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నా.జనవరి 3 నుంచి వివేకా కేసులో మలుపులు తిరగనున్నాయి.

వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించింది.జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయి.

సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు.చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంది.

వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.