వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అధికారులను అడ్డుపెట్టుకొని సీఎం దుర్మార్గాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

జగన్ దుర్మార్గాలను ప్రశ్నించారనే టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని దేవినేని ఉమ విమర్శించారు.

ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని సీఎం జగన్ చేస్తున్నారని ఆరోపించారు.అనంతరం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ