బీజేపీ కార్యకర్తపై మాజీమంత్రి బాబుమోహన్ బూతు పురాణం..!

బీజేపీ కార్యకర్తపై మాజీమంత్రి బాబు మోహన్ బూతుపురాణం లంకించుకున్నారని తెలుస్తోంది.తనకు ఫోన్ చేసిన ఆందోల్ బీజేపీ కార్యకర్త వెంకటరమణని బండ బూతులు తిట్టారు.

నువ్వెంత.నీ బతుకెంత.

? అంటూ కార్యకర్తపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమతో కలిసి పార్టీలో పని చేస్తానని కార్యకర్త చెప్పగా తాను మంత్రిగా ఉన్నప్పుడే ఆందోల్ ను అభివృద్ధి చేశానని బాబు మోహన్ చెప్పారు.

రెండు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా తనను బీజేపీలోకి తీసుకున్నారని తెలిపారు.

తాను ప్రపంచ స్థాయి నేతనంటూ కార్యకర్తపై విరుచుకుపడ్డారు.అనంతరం బండి సంజయ్ పై సైతం ఘాటుగా వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్ ఇంకోసారి తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ని బీట్ చేస్తుందా..?